బ్యాంకు నిర్మించాలని వినతిపత్రం అందజేత
తెలంగాణ జ్యోతి,కన్నాయిగూడెం : కన్నాయిగూడెం బీజేపీ అధ్యక్షురాలు దుర్గం సమ్మక్క ఆధ్వర్యంలో కన్నాయిగూడెం మండలకేంద్రంలో బ్యాంక్ నిర్మాణం చేసి రైతులకు సేవలు అందే విదంగా చూడాలని సబ్ కలెక్టర్ మహేందర్ జీకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా జాడి రామరాజునేత మాట్లాడుతూ కన్నాయిగూడెం మండలంలో బ్యాంకు లేక పోవడం వలన ఆదివాసీ దళిత బహుజన వర్గాల రైతులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. అదేవిదంగా గతంలో 1992 ముందు కన్నాయిగూడెంలో ఉన్న బ్యాంక్ ను భద్రత రక్షణ లేకపోవడంతో ఏటూరునాగారం మండల కేంద్రానికి తరలించి, నాటి నుండి నేటి వరకు కన్నాయిగూడెం మండల ప్రజలకు బ్యాంకు సేవలు అందిస్తున్నారన్నారు. కన్నాయిగూడెం మండల ప్రజలు 40కిలోమీటర్లు నుండి వస్తే ఏటూరునాగారం బ్రాంచి లో నెట్వర్క్ లేకుండ ఉంటే 15రోజులు బ్యాంకు చుట్టూ తిరగడం వలన అనేక ఇబ్బందులకు పడుతున్నారన్నారు. కాబట్టి కన్నాయిగూడెం మండలకేంద్రంలో బ్యాంకు నిర్మించి, ఆదివాసీ, దళిత, బహుజన వర్గాల ప్రజలకు, రైతులకు అందే విదంగా చూడాలని సబ్ కలెక్టర్ మహేందర్ జి ను కోరారు. సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందించి కన్నాయిగూడెం మండలంలో త్వరలోనే బ్యాంకు సేవలు అందేవిదంగా చూస్తామని హామీ యిచ్చారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కుమ్మరి సత్యం, మహిళా మోర్చా అధ్యక్షురాలు పానుగంటి సంగీత, యువమోర్చా అధ్యక్షులు జనగాం ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.
1 thought on “బ్యాంకు నిర్మించాలని వినతిపత్రం అందజేత ”