16న కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం
తెలంగాణ జ్యోతి , కాటారం ప్రతినిధి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈనెల 16న కాటారం మండల కేంద్రమైన గారెపల్లి బిఎల్ఎం గార్డెన్ లో కాటారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెమునూరి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంథని శాసనసభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరవుతారని ఆయన తెలిపారు. మండలంలోని కాంగ్రెస్, యూత్, మహిళా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్ అనుబంధ సంఘాల నాయకులు , వార్డు మెంబర్ నుంచి మొదలుకొని వివిధ కమిటీల చైర్మన్లు సమావేశానికి సకాలంలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.