మురుమూరు గ్రామంలో ఇంటింటి ఫివర్ సర్వే.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వాజేడు మండలం మురుమూరు కాలనీ లో మంగళవారం ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వర్తించడం జరిగింది. అందులో భాగంగా గ్రామాలలో జ్వర పీడితులను, నీరసంగా ఉన్న వారిని గుర్తించి, జ్వరం ఉన్నవారికి రక్తపూత సేకరణ తో ఆర్డిటి పరీక్షలు నిర్వహించారు. రక్తహీనత ఉన్న వారు ,మరియు గర్భవతులను ఇంటి వద్ద కెళ్ళి పరీక్షించటం జరిగింది. రక్తపోటు ,మధుమేహంతో ఉన్న వ్యక్తులను పరీక్షించి నెలవారి మందులు అందజేశారు. గర్భవతి టెస్టుల కొరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పంపించడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల గ్రామాలలో రాపిడ్ ఫీవర్ సర్వే ను ఈనెల 26 వరకు నిర్వహించ నున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య అధికారి. గ్యానస, సూపర్వైజర్స్. వెంకటరమణ, కుప్పిలి కోటిరెడ్డి, ఏఎన్ఎం లు కన్యాకుమారి, రాజేశ్వరి, అంగన్వాడి టీచర్లు, రమాదేవి, ఉష. ఆశా కార్యకర్తలు జానకి. ముత్తమ్మ గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. గ్రామంలో పరీక్షించుకున్న వారు 46 మంది గర్భవతులు,.4 గురు బాలింతలు, క్షయ వ్యాధిగ్రస్తులు, మధు మేహం, రక్తపోటు తదతర వ్యాది తో భాదపడేవారికి పరీక్షలు జరిపి మందులను పంపిణీ చేశారు.