వాడవాడలా మువ్వన్నెల రెపరెపలు
అంబరాన్నంటిన గణతంత్ర దినోత్సవాల సంబరాలు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలును జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు జాతీయ జెండాలను చేత బూని వెంకటాపురం ప్రధాన వీధులలో ర్యాలీ నిర్వహించారు. మండల తాసిల్దార్ ఎం. లక్ష్మీరాజయ్య, మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి. రాజేంద్రప్రసాద్, ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం అధికారి, పోలీస్ స్టేషన్, అన్ని గ్రామ పంచాయతీలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, గిరిజన సంఘాలు, యూనియన్ల నాయకులు వారి, వారి కార్యాలయాలలో జాతీయ జెండాలను ఎగురవేశారు. సొసైటీ కార్యాలయంలో పిఎసిఎస్ చైర్మన్ మోహన్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, పిఎసిఎస్ చైర్మన్ జగన్మోహన్రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం సాంబశివరావు, నాయకులు శ్రీరాములు రమేష్, అతిథి గృహం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేశారు. అలాగే భారాస మండల అధ్యక్షులు గంపా రాంబాబు, సీనియర్ బారాస నేత గుడవర్తి నరసింహమూర్తి, నాయకులు జాగర శాంతమూర్తి, వి.లక్ష్మీ నారాయణ, పలువురు కార్యకర్తలు మండల కేంద్రంలోని బారాస పార్టీ దిమ్మ వద్ద జాతీయ జెండాను ఎగర వేసి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. అలాగే వేపచెట్టు సెంటర్లో పొట్టి శ్రీరాములు, గాంధీ తాత విగ్రహాల వద్ద జాతీయ జెండాలను ఆర్యవైశ్య సంఘం, పుర ప్రముఖులు ఏగురవేసి అభివాదం చేశారు. అన్ని వర్గాల ప్రజలు గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు.