గట్టమ్మ సమీపంలో డీసీఎం వ్యాన్, లారీ ఢీ
– ఇరువురికి గాయాలు
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ములుగు సమీపంలోని గట్టమ్మతల్లి ఆలయం వద్ద పత్తిలోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ అదుపు తప్పి లారీని ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం ఉదయం భద్రాచలం నుంచి పత్తిలోడుతో వరంగల్ వైపుకు వెళ్తున్న డీసీఎం వ్యాన్ గట్టమ్మ సమీపంలోకి రాగానే అదుపు తప్పి హన్మకొండ నుంచి ములుగు వైపుకు వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. స్థాని కుల సమాచారంతో 108లో ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. డీసీఎం, లారీ ఢీకొట్టు కోవడంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ములుగు పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.