కేంద్రంలో అవినీతి లేని పాలన కొనసాగుతోంది

Written by telangana jyothi

Published on:

కేంద్రంలో అవినీతి లేని పాలన కొనసాగుతోంది

– బూత్​ స్థాయిలో సభ్యత్వ నమోదు జరగాలి

– బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్​

ములుగు ప్రతినిధి : పదేళ్ల పాలన పూర్తి చేసుకున్న కేంద్రం లో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతికి ఆస్కారంలోని పాలన కొనసాగిస్తోందని బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్​ స్పష్టం చేశారు. ఆదివారం ములుగు లోని రాయల్ ప్లాజా కన్వెన్షన్​ హాల్ లో పార్టీ సభ్యత్వ నమోదుపై జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అధ్యక్షతన జరిగిన సమావేశానికి కిషోర్​ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ములుగు జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు చేప ట్టాలని పిలుపునిచ్చారు. ఆరేళ్లకోసారి జరిగే ఈ కార్యక్ర మాన్ని మండల అధ్యక్షులు చాలెంజ్​ గా తీసుకొని రాష్ర్టంలో జిల్లా ముందుస్థాయిలో నిలిచేలా కృషి చేయాలన్నారు. సెప్టెంబర్​ 1న ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తూ రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతీ బూత్ లో 200ల సభ్యత్వం చేపట్టాలన్నారు. అభివృద్ధికి కొత్త నిర్వచనం ఇచ్చే బిజేపికి మరింత బలాన్ని ఇచ్చేందుకు నాయకులు, కార్య కర్తలు కృషిచేయాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎస్​.రవీంద్రాచారి, భరతాపురం నరేష్​, నియోజకవర్గ కన్వీనర్ జాడి వెంకట్, జిల్లా సభ్యత్వ నమోదు కన్వీనర్ మండల లవణ్, కో కన్వీనర్ చెవుగాని స్వప్న, వైదుగుల తిరుపతి రెడ్డి, జిల్లా పదాదికారులు జినుకల కృష్ణాకర్ రావు, ఏనుగు రవిందర్ రెడ్డి, మల్లెల రాంబాబు, రుద్రారపు సురేష్, ఓమ్రా, గంగిశెట్టి రాజ్ కుమార్, రవి రెడ్డి, బిజేవైమ్ జిల్లా అధ్యక్షుడు రాయంచు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now