నేటి నుండి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే

నేటి నుండి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే

– జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

ములుగు ప్రతినిధి: నేటి (బుధవారం) నుండి జరిగే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో జిల్లా ప్రజలందరూ పాల్గొని సరియైన సమాచారం అందించి సహకరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.ఇట్టి సర్వే మొత్తం (2) దశలలో నిర్వహించడం జరుగుతుందని, మొదటి దశ ఈ నెల 6 ఇంటింటి సర్వే చేసి కుటుంబ జాబితా షెడ్యులు ద్వారా మొత్తం కుటుంబాల జాబితాను రూపొందించడం జరుగుతుందన్నారు. రెండవ దశ సర్వేచేసి ప్రతి కుటుంబం యొక్క సమగ్ర సమాచారాన్ని సమగ్ర సర్వే షెడ్యూల్ ద్వారా సేకరిస్తారని తెలిపారు. ఇట్టి సర్వే గురించి విస్తృత ప్రచారం చేయడం జరిగిందని, ప్రజాప్రతినిధులు కూడా ఈ సర్వే నందు భాగస్వాములు అవుతారన్నారు. ఈ సర్వేలో జిల్లా ప్రజలందరూ భాగస్వా మ్యులై ఖచ్చితమైన సమాచారం అందించాల్సిందిగా కలెక్టర్ ఆ ప్రకటన లో కోరారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment