ప్రైవేట్ హాస్పిటల్స్ పార్కింగ్ అడ్డాగా మారిన రైతు వేదిక
– రైతు వేదిక భవనం ను ప్రైవేట్ ఆసుపత్రులు వాడుకోవడం ఏంటి అని రైతుల ప్రశ్న?
నర్సంపేట,తెలంగాణ జ్యోతి : ప్రైవేట్ హాస్పిటల్స్ పార్కింగ్ అడ్డాగా నర్సంపేట రైతు వేదిక దర్శనమిస్తుంది. రైతులంతా ఒకే చోట చేరి వ్యవసాయం, సాగు చేసే పంటల గురించి చర్చించుకోవడం కోసం అప్పటి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సకల వసతులతో రైతు వేదికల భవనాలను నిర్మించి ఏ ఈ ఓ అధికారులను కూడా నియమించారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటుచేసి ఒక్కో క్లస్టర్‌కు ఒక రైతు వేదికను ఒక్కో వేదిక నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.22 లక్షలతో నిర్మించి అందుబాటులోకి తెచ్చారు. వివరాల్లోకి వెళితే… నర్సంపేట ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా నిర్మించిన రైతు వేదిక భవనం నిర్మాణం పూర్తి చేసి నిరుపయోగంగా వదిలేయడం తో ప్రైవేట్ హాస్పిటల్ యజ మానులు, ఆ హాస్పిటల్ కి వచ్చే పేషెంట్లు వారి యొక్క వాహనాలను రైతు వేదిక స్థలాన్ని పార్కింగ్ గా వాడు కుంటున్నారు. అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడక పోవడంతో రైతు వేదిక చుట్టూ పచ్చి గడ్డితో పేరుకుపోయి హాస్పిటల్‌కు వచ్చే పేషెంట్లు రైతు వేదికను అడ్డాగా మలుచు కొని మల మూత్ర విసర్జనలు చేస్తున్నారని చుట్టుపక్క వారు వాపోతున్నారు. ఇప్పటికైనా రైతు వేదిక ప్రధాన ద్వారముకు గేటు అమర్చాలని పలువురు కోరుతున్నారు.