విద్యార్థులకు ప్రమాదపు అంచున తేనెటీగల గూడు
తెలంగాణ జ్యోతి, నర్సంపేట : తేనె ఎంత మధురంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అయితే తేనెటీగలు కుడితే పట్టపగలే పెద్దవారికి చుక్కలు కనిపిస్తాయి. అదే చిన్న పిల్లలకు కుడితే ప్రాణాలు అరిచేతులు పెట్టుకోవాల్సిందే కొన్ని సార్లు ప్రాణాంతకంగా మారి ప్రాణాలు కూడా పోతాయి. వివరాల్లోకి వెళితే… నర్సంపేట పట్టణంలో మహేశ్వరం శివారులో గల సెంటిమెరి ప్రవేట్ పాఠశాల ప్రాంతంలోని విద్యార్థులు కూర్చునే గదుల ఎదురుగా తేనెటీగలు గూడు నిర్మించుకున్నాయి. తేనెటీగలు ఎప్పుడు విద్యార్థులపై దాడి చేస్తాయోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ యజమానులకు ఫీజుల పైన ఉన్న శ్రద్ధ పిల్లల ప్రాణాలపై లేదని ఆ తేనెటీగలు గూడు నిలువెత్తు నిజం లా మారింది ఇప్పటికైనా తేనెటీగలు గూడును తొలగించాలని కోరుతున్నారు.