స్త్రీల ఆరోగ్యం పట్ల కొండాయిలో ర్యాలీ
తెలంగాణ జ్యోతి, ఏటూరు నాగారం : మండలంలోని కొండాయి గ్రామపంచాయతీ పరిధిలో డాక్టర్ హెచ్ ప్రణీత్ కుమార్ ఆధ్వర్యంలో స్త్రీలు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ ప్రణీత్ కుమార్ మాట్లాడుతూ స్త్రీలలో నెలవారి సమస్యలు గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు, సరైన ఆహారం, రోజు వారి వ్యాయామం గురించి స్త్రీలకు, గర్భిణీలకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.