Telangana : గొర్రెల యూనిట్లకు గుడ్ బై ..? 

Written by telangana jyothi

Published on:

Telangana : గొర్రెల యూనిట్లకు గుడ్ బై ..? 

– లబ్ధిదారుల వాటా వాపస్‌ చేసేందుకు కసరత్తు

– ఏడేళ్లలో 20,625 మందికే యూనిట్లు

– డీడీలు కట్టిన 3,868 మందికి డబ్బులు వాపస్‌

– త్వరలోనే చెల్లింపులకు యంత్రాంగం చర్యలు..!

డెస్క్ :  గొర్రెల యూనిట్ల పంపిణి పథకాన్ని ప్రభుత్వం పక్కన పెట్టినట్టు తెలుస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో గతంలో గొర్రెల యూనిట్ల కోసం గొర్రెల కాపరులు తమ వాటాగా చెల్లించిన డబ్బులను తిరిగి చెల్లించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఒక లబ్ధిదారుడికి వాటా డబ్బులు వాపస్‌ చేసిన జిల్లా యంత్రాంగం మిగిలినవారికి కూడా తిరిగి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. గొర్రెల కాపరుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం 2017లో గొర్రెల యూనిట్ల పంపిణి పథకం ప్రారం భించింది. యూనిట్‌ ధర రూ.1.25 లక్షలుగా నిర్ణయించి, లబ్ధిదారుడి వాటాగా రూ.31,250 చెల్లిస్తే మిగిలినది ప్రభుత్వం సబ్సిడీగా భరించి గొర్రెలను పంపిణి చేశారు. ఒక్కో యూనిట్‌లో 20 మేలుజాతి గొర్రెలు, ఓ పొట్టేలును అందజే సింది. తొలి విడతలో సంగారెడ్డి జిల్లాలో 19,203 మంది లబ్ధిదారులకు యూనిట్లు మంజూరయ్యాయి. ఈమేరకు లబ్ధిదారుల వాటా మొత్తాన్ని డీడీల రూపంలో ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్నది. ఇలా 5,290 మంది లబ్ధిదారులు గొర్రెల యూనిట్ల కోసం తమ వాటా డబ్బులను చెల్లించారు. కానీ, మూడేళ్లలో వీరిలో 1,422 మందికి మాత్రమే గొర్రెల యూనిట్లను మంజూరు చేశారు. మిగిలిన 3,868 మందికి గొర్రెలు ఇవ్వలేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం గొర్రెల యూనిట్ల పథకంను కొనసాగించ కూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. లబ్ధిదారుల వాటా డబ్బులు తిరిగి ఇచ్చేయాలని సూచించినట్టు తెలిసింది.గొర్రెల యూనిట్లు మంజూరు కాని 3,868 మందికి తమ వాటా డబ్బులు వాపస్‌ చేసేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. తమ వాటా డబ్బులు ఇచ్చే యాలని దరఖాస్తు చేసుకున్నవారికి మొదటి ప్రాధాన్యతగా చెల్లింపుల ప్రక్రియను యంత్రాంగం చేపట్టనుంది. ఇప్పటి వరకు 1,195 మంది లబ్ధిదారులకు మాత్రమే వాటా డబ్బులు వాపస్‌ చేయాలని చేసుకున్నారు. వీరిలో ఒకరికి వాటా డబ్బులను అధికారులు తిరిగి ఇచ్చేశారు. మరో 257 మందికి డబ్బులు వాపస్‌ తిరిగి ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now