ఓటు హక్కును వినియోగించుకున్న ఐటీ మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : భూపాలపల్లి జిల్లా కాటారం మండలం స్వగ్రామం ధన్వాడ లోని ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఓటు హక్కు వినియో గించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సాయంత్రం వరకు కొనసాగే పోలింగ్ కేంద్రాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.
1 thought on “ఓటు హక్కును వినియోగించుకున్న ఐటీ మంత్రి శ్రీధర్ బాబు”