వెంకటాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు.
- బతుకమ్మలతో ఆడి పాడిన విద్యార్థులు, ఉపాధ్యాయులు .
- దసరా సెలవు లతో సంబరాలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం దసరా సెలవల సందర్భంగా విద్యార్థులు బతుకమ్మలతో ఆడి పాడి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సైతం విద్యార్థులతో కలిసి ఆనంద పరిచారు. దసరా సెలవులు కారణంగా తమ పాఠశాలలో, తమ విద్యా నిలయంలో ఉపాధ్యాయుల తో బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలని విద్యార్థులు బతుకమ్మల పండుగ ను అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో బతుకమ్మలసందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవివి సత్యనారాయణ ,నోడల్ ఆఫీసర్ బొల్లి శ్రీనివాస్, ఉపాధ్యాయులు సంతోష్, నరసింహారావు, సుజాత, ఝాన్సీ, మౌలాలి ,రామ్ కోటి, శ్రీరామ్మూర్తి, విజయ, ఆంజనేయులు ,గంగ తో పాటు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
1 thought on “వెంకటాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు.”