అటవీ జంతువులకు విద్యుత్ తీగలు అమరస్తే కఠిన చర్యలు
– కాళేశ్వరం ఎస్సై భవాని సేన.
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండలం, కాళేశ్వరం అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు విద్యుత్ తీగలు అమర్స్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాళేశ్వరం ఎస్సై భవాని సేన హెచ్చరించారు. రాత్రి వేళలో అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల కోసం విద్యుత్ తీగలు అమర్చటం వలన వన్యప్రాణులతో పాటు, గేదెలు ,బర్రెలు, మేకలు, గొర్రెలు, మనుషుల ప్రాణాలు పోయిన సంఘటనలు అనేకం ఉన్నాయని ఎవరైనా అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగల అమరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామనిఇప్పటికే చండ్రుపల్లి గ్రామంలో ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమైండ్ కి తరలించినట్లు పేర్కొన్నారు.