తెలంగాణ జన జాతర సభలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొనాలి
– బ్లాక్ కాంగ్రెస్ కమిటి అధికార ప్రతినిధి భాస్కర వెంకటరమణ
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : ఈనెల 6 న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ లో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అధ్వర్యంలో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ జాతీయ మెనిఫెస్టో విడుదల కార్యక్రమంకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీతో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరవుతున్నారు. ఈ జన జాతర బహిరంగ సభలో రాష్ట్రానికీ సంబందించిన పలు విషయాలను జాతీయ కాంగ్రెస్ మేనిఫెస్టో ఛైర్మెన్, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు రూపొందించిన తెలంగాణ రాష్ట్రానికీ సంబందించిన జాతీయ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులు అవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో మహాదేవ పూర్ బ్లాక్ కాంగ్రెస్ కమిటి పరిధి లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్య కర్తలు, అన్ని అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, శ్రీధర్ బాబు అభిమానులు, శ్రీను బాబు అభిమానులు తుక్కుగూడ జన జాతర బహిరంగ సభలో పెద్ద ఎత్తున పాల్గొని మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబు ల నాయకత్వం ను బలపరచాలని బ్లాక్ కాంగ్రెస్ కమిటి అధికార ప్రతినిధి భాస్కర వెంకటరమణ కోరారు.