నాటు సారా విక్రేత అరెస్టు
ఏటూరునాగారం, తెలంగాణా జ్యోతి ప్రతినిధి : మంగపేట రహదారిలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా కమలాపురం గ్రామానికి చెందిన భూక్య లక్ష్మణ్ ద్విచక్ర వాహనంపై వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయవా అతని వద్ద 10 లీటర్ల నాటు సారాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పది లీటర్ల నాటు సారా, ద్విచక్ర వాహనాన్ని అదుపులోకి తీసుకొని భూక్య లక్ష్మణ్ ను కోర్టులో హాజరు పట్టినట్లు ఎక్సైజ్ సిఐ రామకృష్ణ తెలిపారు. ఎవరైనా నిషేధిత సారాయి అమ్మిన రవాణా చేసిన వారికి కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సందీప్, నవీన్, తిరుపతి, నాగరాజు, శ్రీనివాస్, వీరన్న, ప్రణయ్ పాల్గొన్నారు.