మంటల్లో దగ్ధమైన ఇల్లు – ఆర్ధిక సహాయం అందజేత
తెలంగాణ జ్యోతి, కాటారం : కాటారం మండలం కొత్తపల్లి గ్రామం లో అనుకోని సంఘటనతో ప్రమాదవశాత్తు తేజావత్ సరోజన, ఇళ్లు మంటల్లో పూర్తిగా దగ్ధమైపోవడంతో వారి కుటుంబం కట్టుబట్టలు తో సహ వీధిన పడడంతో సోమవారం వారికి ఆర్ధిక సహాయాన్ని కాంగ్రెస్ టిపిసిసి మహిళా విభాగం స్టేట్ సెక్రటరీ మాజీ జెడ్పీటీసీ ఆంగొత్ సుగుణ, ఎంపిటిసి ఊడుముల విజయ రెడ్డి, మండల ఉపాధ్యక్షురాలు సుశీలలు అందించి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షురాలు రజిత, నాయ కురాలు వసంత తదితరులు ఉన్నారు.