పార్లమెంటు ఎన్నికల జాతీయ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ గా దుద్దిళ్ల శ్రీధర్ బాబు
తెలంగాణ జ్యోతి, కాటారం: తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ను తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించింది.ఈమేరకు శుక్రవారం హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ను రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామగిరి మండలం ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్, మంథని అసెంబ్లీ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రామగిరి మండల కాంగ్రెసు పార్టి ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీటీసీ ముస్త్యాల శ్రీనివాస్, ఎంపీటీసీ కొప్పుల గణపతి, ఆరెల్లి మహేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.