ఆర్థిక అక్షరాస్యత పై టి జి బి అవగాహన
తెలంగాణ జ్యోతి , కాటారం ప్రతినిధి: ఆర్థిక అక్షరాస్యతతో ప్రజలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవచ్చని కాటారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖ మేనేజర్ ఐలేష్ అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం పరికిపల్లిలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, పిఎంఎస్బిఐ తదితర పథకాల ప్రయోజనాలను వివరించారు. రుణాలను తిరిగి సకాలంలో చెల్లించాలని రైతులకు సూచించారు. అలాగే మహిళా స్వశక్తి సంఘ సభ్యులకు అవగాహన కల్పించారు. గ్రూపు సభ్యులు తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, గ్రామ ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.