కేరళ సంప్రదాయ చిత్రానికి జాతీయ అవార్డు

కేరళ సంప్రదాయ చిత్రానికి జాతీయ అవార్డు

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: కేరళ రాష్ట్రంలోని అల్లేప్పె లో అక్టోబర్ 8,9,10 మూడు రోజుల పాటు నిర్వహించిన “ఉస్సేన్ ఖాన్ సిక్స్ నేషనల్ లెవెల్ వర్క్ షాప్” లో మహాదేవపూర్ ఫోటో గ్రాఫర్ పంతకాని రాజు తీసిన కేరళ సంప్రదాయ నృత్యం “తెయ్యం” దేవత చిత్రానికి తృతీయ బహుమతి లభించింది.ఉస్సేన్ ఖాన్ చేతుల మీదుగా ఫోటో గ్రాఫర్ పంతకాని రాజు ఈ అవార్డు అందుకున్నారు. కేరళ సంప్రదాయంలోని కథకళి, తెయ్యం, కడియరపట్టు కళలపై ఫోటో వర్క్ షాప్ జరుగగా, తెయ్యం దేవత చిత్రానికి ఈ అవార్డు లభించిందని,సంప్రదాయాల నేల కేరళ రాష్ట్రంలో ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని ఫోటో గ్రాఫర్ పంతకానీ రాజు అన్నారు.జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండిస్తున్న పంతకాని రాజు ను ప్రత్యేకంగా అభినంది స్తున్నామని సర్పంచ్ శ్రీపతిబాపు అన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment