మహాదేవపూర్ గ్రీన్ వుడ్ పాఠశాలలో పదవ తరగతి వీడుకోలు సెలబ్రేషన్స్.
– ఆకట్టుకున్న విద్యార్థుల నాట్య ప్రదర్శన.
– పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు.
– విద్యార్థులు పదికి పది గ్రేడ్ మార్కులు సాధించాలి ప్రజా ప్రతినిధులు, అధికారులు .
మహాదేవపూర్ /తెలంగాణ జ్యోతి : మహదేవపూర్ మండల కేంద్రంలోని గ్రీన్ వుడ్ పాఠశాలలో పదవ తరగతి వీడుకోలు సమావేశం కార్యక్రమంను ఘనంగా నిర్వహిం చారు. ఆదివారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు అద్భుతమైన నాట్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అందరిని అలరించారు.అలాగే పదవ తరగతి విద్యార్థుల వారి మధుర స్మృతులను గుర్తు చేస్తూ ప్రసంగిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పిటీసి గుడాల అరుణ, యంపిటిసి ఆకుతోట సుధాకర్, పిఎసిఎస్ చైర్మన్ చల్ల తిరుపతి రెడ్డి, మహదేవపూర్ ఎస్ ఐ కె ప్రసాద్ హాజరయ్యారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల వ్యవస్థాపకులు చిర్ల శ్రీనివాస రెడ్డి,ప్రధానో ఉపాధ్యాయ లు చిర్ల శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ ఆకుతోట రాజ్ కుమార్,ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థి దశలో పాఠశాల స్థాయి లో పదవ తరగతి ముఖ్యమైనదని, ఈ దశలోనే విధ్యార్థులు మంచి నడవడిక, పట్టుదలతో కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లి తండ్రులు అధిక సంఖ్యలో విజయవంతం చేశారు.