మేడారం జాతరలో భక్తులకు బైక్ అంబులెన్స్ సేవలు 

మేడారం జాతరలో భక్తులకు బైక్ అంబులెన్స్ సేవలు 

– ప్రారంభించిన మంత్రి సీతక్క .

ములుగు, తెలంగాణ జ్యోతి : మేడారం గిరిజన మ్యూజి యంలో బైక్ అంబులెన్స్ లను శనివారం మంత్రి అనసూయ సీతక్క , హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా, హెల్త్ కమిషనర్ ఆర్ వి కర్ణన్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రత్యేక అధికారులు ఎస్. కృష్ణ ఆదిత్య, రాధిక గుప్త, ప్రతిమ సింగ్ జెండా ఊపి ప్రారం భించారు. ఈ సందర్భగా మంత్రి మాట్లాడుతూ మేడారం జాతరలో భక్తుల రద్దీ పెరుగుతుందని ఆపద సమయంలో భక్తులకు సేవలు అందిచనికి నూతనంగా బైక్ అంబులెన్స్ లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. జాతరలో 40 బైక్ అంబులెన్స్లు ఏర్పాటు చేశామని ఇందులో 21 రకాల వస్తు వుల కిట్ ద్వారా భక్తులు వైద్యం అందించడం జరుగుతుంది అని తెలిపారు. ముఖ్యంగా రద్దీ ఉండే ప్రాంతాలలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జాత రకు వచ్చే భక్తులు ఇబ్బందులూ పడకుండా సమన్వయం తో దేవతల దర్శనం చేసుకోవాలని ఆపద సమయంలో సేవలు అందించే అంబులెన్స్ కి దారి ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ, జిల్లా వైద్య అధికారి ఆలెం అప్పయ్య ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment