శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి.

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి.

మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండలంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి నంద కుటుంబ సమేతంగా దర్శించుకు న్నారు. ముందుగా వారిని అర్చకస్వాములు ప్రధాన రాజగోపురం ముందు నుండి మర్యాద పూర్వక స్వాగతం పలికిన అనంతరం స్వామివారికి అభిషేకం అమ్మవారి ఆలయంలో అర్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం స్వామివారి శేష వస్త్రాలతో సన్మానించిన అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అంద చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, భూపాలపల్లి జిల్లా జడ్జి, మంచిర్యాల జిల్లా జడ్జి, చెన్నూరు జడ్జి, కాటారం డిఎస్పి రాం మోహన్ రెడ్డి, మరియు పోలీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment