పాలెం ప్రాజెక్టు సాగునీరు అందక ఎండి పోతున్న పంటలు

పాలెం ప్రాజెక్టు సాగునీరు అందక ఎండి పోతున్న పంటలు

– దిక్కు తోచని స్థితిలో అన్నదాతలు

– పట్టించుకోని జిల్లా యత్రాంగం, ప్రాజెక్ట్ అధికారులు.

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యొతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం లో సుమారు 250 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఉపయోగించి అన్నదాతలకు సాగు నీళ్లు అందివ్వాలని లక్ష్యం తో దశాబ్ద కాలం క్రితం పాలెం వాగు ప్రాజెక్ట్ నిర్మించారు. ఆ లక్ష్యం నీరు కారు తోందని ములుగు జిల్లా వెంకటాపురం మండలం బర్లగూడెం సర్పంచ్ కొర్స నర్సింహా మూర్తి ఆరోపించారు. సుమారు పదివేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యం తో వెంకటాపురం మండలం రాచపల్లి ,మల్లాపురం వద్ద పాలెం వాగుపై ప్రాజెక్ట్ నిర్మించారు. పాలెం వాగు ప్రాజెక్ట్ నిర్మాణం జరిగి దశాబ్ద కాలం దాటి పోతున్న సకాలం లో సాగు నీరు పొలాలకు అందక పోవటంతో పంటలు ఎండి పోఇ అన్నదాతలు తీవ్రంగ నష్ట పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . బర్లగూడెం గ్రామపంచాయతీ రైతులకు ప్రాజెక్ట్ నీళ్లు అందక పోవడం తో వ్యవసాయానికి దూరం అవుతున్న రైతుల సంఖ్య నానాటికి పెరిగి పోతూ ఉన్నట్టు ఆయన తెలియజేశారు. ప్రాజెక్ట్ కున్న ఒకే ఒక్క ప్రధాన కాలువ ఈ పదేళ్లల్లో అనేక చోట్ల కోతకు గురి అయి, గండ్లు పడ్డాయన్నారు. ప్రాజెక్ట్ సమగ్ర నిర్వహణ బాధ్యత సంబంధి త అధికారులకు పట్టడం లేదన్నారు. ప్రతి ఏడాది వానాకాలం సమయం లో చిన్న గంగారం దగ్గర గండి పడుతోందని, ఆ గండిని అధికారులు పూడ్చక పొతే రైతులే తమ సొంత డబ్బులు పెట్టుకొని గండి పూడ్చు కుంటున్నట్లు సర్పంచ్ నర్సింహా మూర్తి తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలం లో కాలువ మరమ్మత్తులు చేయడం పూర్తిగా మర్చి పోయిందన్నా రు. కనీసం ప్రస్తుత ప్రభుత్వం అయిన దృష్టి పెట్టాలన్నారు. ప్రధాన కాలువ మొత్తం పూడిక వచ్చి బర్లగూడెం గ్రామపంచాయతీ, మొత్తం ఆయకట్టు కు సాగు నీళ్లు రాక పోవడం తో రైతులే తమ సొంత డబ్బులు వెచ్చించి జేసీబీ సహాయం తో గత మూడేళ్లుగా పూడిక లు తీసుకుంటున్నారని అన్నారు. సాగు నీళ్లు రాక వేసిన పంటలన్నీ ఎండి పోతున్నాయని , కాలువ పూడిక తీపించి ,మరమ్మమతులు చేయాలని రైతులు ప్రాజెక్ట్ ఏ ఈ ని అడిగి కన్నీళ్లు పెట్టుకున్నప్పటికీ, ఆ అధికారి ఏ మాత్రం చలించ లేదని ఆయన అన్నారు. గత నెల రోజులుగా అన్నదాతలు అధికారుల చుట్టూ తిరుగు తున్నా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. గత రెండు రోజులుగా బర్లగూడెం గ్రామపంచాయతీ సాగుదారులు,ఆయకట్టు దారులు తమ సొంత డబ్బులు పెట్టి జేసీబీ సహాయం తో ప్రధాన కాలువకు పూడిక తీసు కుంటుంటున్నట్లు తెలియజేశారు. గురువారం కాలువ లో పేరుకు పోయిన మట్టిని పెద్ద మెషన్ సహాయం తో తొలిగించమని ప్రాజెక్ట్ అధికారిని ఆదివాసీ రైతులు కోరగా, డీజిల్ ఖర్చు మీరే భరించాలని ఆ అధికారి బదులు ఇచ్చినట్టు రైతులు వాపోతున్నారని సర్పంచ్ నర్సింహా మూర్తి తెలిపారు. ఆదివాసీ రైతులే తమ సొంత డబ్బులు పెట్టి కాలువ మరమ్మత్తులు చేసుకుంటూ ఉంటే, అధికారులు, ప్రభుత్వం ఉండి ఎందుకని ప్రశ్నించారు. లక్షల రూపాయలు అప్పులు తెచ్చి వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టి చేస్తేసాగు నీళ్లు రాక అన్నదాతలు అప్పుల పాలై పోతున్నారని అన్నారు. ములుగు జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా స్ఫంందించి పాలెం వాగు నీళ్లు సాగుదారులకు అందేలా తక్షణమే భారీ యంత్రం సహాయం తో గుట్టలు గుట్టలు గా పేరుకు పోయిన మట్టిని తొలిగించాలని కోరినారు. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు రైతులకు అందుబాటులో ఉండటం లేదన్నారు. తమ విధులను విస్మరించే ఇలాంటి అధికారుల పైన కఠిన చర్యలు కోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాలువలో పేరుకు పోయిన మట్టిని తొలిగించక పొతే రిలే నిరాహార దీక్షలు చేపడతానని సర్పంచ్,మరియు ఆయకట్టు రైతులు హెచ్చరించారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment