డాక్టర్ రవీందర్ ఇంట్లో కవితక్క సందడి
-భారత జాగృతి అధ్యక్షురాలు కవితకి తేనేటి విందు..
– కుటుంబ సభ్యులతో ఆప్యాయత పలకరింపు
– సాదరంగా స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు
ములుగు, తెలంగాణ జ్యోతి : భారత జాగృతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పోరిక రవీందర్ ఇంట్లో భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం సందడి చేశారు. మేడారం సమ్మక్క సారమ్మలను దర్శించుకోవడానికి వెళుతున్న క్రమంలో ములుగు గట్టమ్మ వద్ద భారత జాగృతి జిల్లా అధ్యక్షుడు డా.పోరిక రవీందర్ జాగృతి బృందం ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత గట్టమ్మ తల్లిని దర్శించుకొని మేడారం వెళ్లి తిరుగు ప్రయాణంలో ములుగు భారత జాగృతి జిల్లా అధ్యక్షుడు పోరిక రవీందర్ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మంగళహారతితో సాధరంగా ఆహ్వానం పలికారు.కాగా కుటుంబ సతి సమేతంగా కవితకు వస్త్రాలు, శాలువా మేమొంటోను అందజేసి జ్ఞాపకతను చాటుకున్నారు. అక్కడికి వచ్చిన భారత జాగృతి ములుగు జిల్లా బృందం కవితతో ఫోటోలు దిగి సందడి చేశారు. అంతేకాకుండా బంధువులు అభిమానులు తమ సెల్ఫోన్లో సెల్ఫీ దిగారు. అనంతరం భారత జాగృతి జిల్లా అధ్యక్షుడు డా.పో రిక రవీందర్ ఇచ్చిన తేనేటి విందును స్వీకరించారు.ఈ కార్యక్రమం లో ఎంపీలు మాలోత్ కవిత ,పసునూరి దయాకర్ , ములుగు జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి,నాగూర్ల వెంకటేశ్వర్లు పోరికశ్యామల నాయ క్, పోమ నాయక్, భారత జాగృతి జిల్లా మహిళా అధ్యక్షురాలు పుర్రి స్వరూప, గొట్టేముక్కుల ఈశ్వరి, పాడ్య కుమార్, రాహుల్ నాయక్, అంతటి రాము, హరీష్ రెడ్డి, గుడిగంటి హరీష్, డాక్టర్ రవీందర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
1 thought on “డాక్టర్ రవీందర్ ఇంట్లో కవితక్క సందడి”