జిల్లా కేంద్రంలోని యూటర్న్ ల వద్ద జరుగుతున్న ప్రమాదాలను నివారించాలి.
ములుగు, డిసెంబర్23, గవాక్షం ప్రతినిధి : ములుగు జిల్లా కేంద్రం లోని ప్రధాన రహదారి యూటర్న్ ల వద్ద జరిగే ప్రమాదా లను నివారించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర ఈసీ మెంబర్ చల్లూరి మహేందర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటికి వినతిపత్రం అందించారు. ఎన్ హెచ్ఆర్ సి క్షేత్రస్థాయి పరిశీలన పిమ్మట మాట్లాడారు. నేషనల్ హైవే 163 పై ములుగు జిల్లా కేంద్రంలో యూటర్న్స్ ఉన్నచోట తరచూ ప్రమాదాలు జరుగు తున్నాయన్నారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో డివైడర్ మధ్య లో ఏర్పాటు చేసిన చెట్లు ఏపుగా పెరిగి, డివైడర్ కు కట్టిన కంచెకు ఫ్లెక్సీలు కట్టడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, దీంతో ప్రాణ నష్టం వాటిల్లుతుం దని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల హక్కుల కమిటి ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర ఈసీ మెంబర్ చల్లూరి మహేందర్, జిల్లా అధ్యక్షులు పాల్తీయ రాజశేఖర్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి శనిగరపు ప్రవీణ్, లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
1 thought on “జిల్లా కేంద్రంలోని యూటర్న్ ల వద్ద జరుగుతున్న ప్రమాదాలను నివారించాలి.”