బాలికలకు హెచ్‌పీవీ టీకాలు
గర్భాశయ క్యాన్సర్ నివారణపై అవగాహన
వెంకటాపురం నూగురు, ఏప్రిల్ 18, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం నిర్వహించారు. సీహెచ్‌సీ వెంకటాపురంలో వైద్యాధికారి డాక్టర్ శివాజీ పర్యవేక్షణలో విద్యార్థుల తల్లిదండ్రులకు టీకా ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా రక్షణ కవచమని, 14 నుంచి 15 సంవత్సరాల లోపు బాలికలు తప్పనిసరిగా ఈ టీకా వేయించుకోవాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో టీకా కార్యక్రమం నిర్వహించగా, చిరుతపల్లి వన్ పాఠశాలలో 21 మంది, ఇతర గ్రామాల విద్యార్థినులకు 17 మందికి కలిపి మొత్తం 38 మందికి టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మీనా రాణి, ఉష రాణి, శాంత కుమారి, హెచ్‌ఈఓ కుప్పిలి కోటిరెడ్డి, భారతమ్మ, రోజా రాణి, ఆదిలక్ష్మి, సరూప, సుశీల, పార్వతి, ఏఎన్ఎం వినోదతో పాటు వివిధ సబ్ సెంటర్ల ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.









