ఇసుక క్వారీ నిర్వహణకు గ్రామసభ ఆమోదం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం రామచంద్రపురం పంచా యతీ పరిధిలోని, గోదావరి ఇసుక సొసైటీ క్వారీ నిర్వహణకు మంగ ళవారం జరిగిన పీసా గ్రామ సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సంబంధిత గ్రామసభ వివరాలను వెంకటాపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ. బాబు మంగళవారం సాయంత్రం మీడియా కు విడుదల చేశారు. గ్రామ సభలో శ్రీ కనకదుర్గ గిరిజన ఇసుక క్వారీ మహిళ పరస్పర సహాయక సంఘం వారిని సభ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ సభలో 473 మొత్తం గిరిజన ఓటర్లు ఉండగా,వారిలో 354 మంది హాజరు అవటం తో పూర్తి స్తాఇ కోరం వుందని అదికారులు ప్రకటించారు. చేతులెత్తు విధానం ద్వారా ఎన్నుకోవడం జరిగింది. గ్రామసభకు రామచంద్రాపురం సర్పంచ్ అట్టం సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఎంపిడివో బాబు, ఎంపీటీసీ సున్నం సాంబశివరావు,పిసా జిల్లా కో ఆర్డి నేటర్ కొమరం ప్రభాకర్, ఎం పి ఓ. ఆర్. హనుమంతరావు, మరియు పిసా సభ్యు లు, ఓటర్లు తదతరులు గ్రామ సభలో పాల్గొన్నారు.
1 thought on “ఇసుక క్వారీ నిర్వహణకు గ్రామసభ ఆమోదం. ”