ఆధార్ అప్డేట్ కేంద్రం ప్రారంభం కు ప్రతిపాదనలు
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలోని తహా శీల్దార్ ఆఫీస్ లో శాశ్వత ఆదార్ నమోదు కేంద్రం ద్వారా అందించే ఆదార్ నమోదు , అప్డేట్ సేవలు కొంతకాలంగా నిలిచిపోయాయి. మరల వెంకటాపురం మండలంకు శాశ్వత ఆదార్ నమోదు కేంద్రా న్ని పున రుద్దరిoచేందుకు ఇ- డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ , డిఎం. విజయ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఆధార్ ఆపరేటర్ వద్ద నుండి కావాల్సిన దృవీకరణ పత్రాలను పరిశీలించి సేకరించారు. ఇందులో బాగంగా వెంకటాపురం మండలంలోని మీసేవ కేంద్రాలను తనికీలు చేశారు. మీ సేవ కేంద్రాల వద్ద దరఖాస్తుదారులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పౌరులకు పారదర్శకంగా మెరుగైన సేవలను సకా లంలో అందించాలని నిర్వాహకులకు అదికారులు ఆదేశించారు.
1 thought on “ఆధార్ అప్డేట్ కేంద్రం ప్రారంభం కు ప్రతిపాదనలు”