లక్ష్మీదేవిపేటలో గ్రామీణ గ్రంథాలయం ప్రారంభం
గ్రంథాలయాలు విజ్ఞాన గనులు
ములుగు, ఏప్రిల్ 12, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట గ్రామంలో కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ గ్రంథాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రియనేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పింగళి నాగరాజు, కలాం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మహమ్మద్ సర్వర్ అహ్మద్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పింగళి నాగరాజు మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలు అని, వాటిని సద్వినియోగం చేసుకుంటే విద్యార్థులు, యువత ఉన్నత స్థాయికి చేరుకుని ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత పదవులు సాధించవచ్చని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు, చరిత్ర, జ్ఞానం అన్నీ గ్రంథాలయాల ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. స్వంత ఖర్చులతో ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ సర్వర్ అహ్మద్ సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ గ్రంథాలయాన్ని విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావులు మాత్రమే కాకుండా సమీప గ్రామాల ప్రజలు కూడా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈటీవీ సీనియర్ రిపోర్టర్ అబ్దుల్ రజాక్, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు కొట్టే రాజిరెడ్డి, జర్నలిస్ట్ యూనియన్ ములుగు జిల్లా అధ్యక్షులు షఫీ అహ్మద్, కలాం ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి కొండపర్తి సదయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ పెండ్యాల సలేంద్రం, కోశాధికారి గడ్డం వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షురాలు సుల్తానా బేగం, సభ్యులు పోలో రామ్మూర్తి, మహిపాల్ రెడ్డి, వల్లాల రాజేందర్, అడ్వకేట్ రమేష్, నాగేశ్వరరావు, కైరుద్దీన్, ముస్తాక్, బొచ్చు సమ్మయ్య, బొమ్మకంటి రమేష్ వర్మ, దుర్గం సూరయ్య, కొండపర్తి రమేష్, రేలా విజయ్ తదితరులు పాల్గొన్నారు.









