ఇష్టానుసారంగా మందుల వాడకం హానికరం

On: April 11, 2026 6:29 PM

ఇష్టానుసారంగా మందుల వాడకం హానికరం

ఇష్టానుసారంగా మందుల వాడకం హానికరం

డ్రగ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ రెడ్డి

యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పై అవగాహన

ములుగు, తెలంగాణ జ్యోతి : మానవ శరీరం నిర్వీర్యం కాకుండా ఉండాలంటే మోతాదు ప్రకారం, డాక్టర్ సూచనల ప్రకారం మాత్రమే ఔషధాలు వాడాలని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కోమల్ల దేవేందర్ రెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ ఔషధ నియంత్రణ శాఖ, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సంయుక్త ఆధ్వర్యంలో ఔషధాల దుర్వినియోగం, మత్తు పదార్థాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ దేవేంరద్ రెడ్డి మాట్లాడుతూ.. సరైన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీ బయోటిక్స్ వాడకూడదని, దీనివల్ల యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏర్పడి భవిష్యత్తులో మందులు పనిచేయని స్థితి వస్తుందని హెచ్చరించారు. నకిలీ మందుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మందుల నాణ్యతను తనిఖీ చేయడానికి ప్యాకింగ్‌పై ఉన్న క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయాలని సూచించారు. ఏదైనా ఫిర్యాదులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969 కు సమాచారం ఇవ్వాలని కోరారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలను ఈ సదర్భంగా వివరించారు. వీటి సరఫరా, విక్రయాలపై సమాచారం ఉంటే 1908 టోల్ ఫ్రీ నంబర్‌కు పిర్యాదు చేయాలన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మత్తుకు బానిసైన వారి కోసం ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో 10బెడ్లతో కూడిన డ్రగ్ అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ (ఏటీఎఫ్) ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గోపాలరావు, డీసీహెచ్ఎస్ జగదీశ్వర్, హాస్పిటల్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ములుగు జిల్లా మెడికల్ అసోసియేషన్ సభ్యులు, మెడికల్ షాపు యజమానులు, ఫార్మసిస్ట్‌లు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!