ఈనెల 12న తుడుందెబ్బ మండల కమిటీ ఎన్నిక

On: April 10, 2026 1:02 PM

ఈనెల 12న తుడుందెబ్బ మండల కమిటీ ఎన్నిక

ఈనెల 12న తుడుందెబ్బ మండల కమిటీ ఎన్నిక

ఏటూరునాగారం, ఏప్రిల్ 10 తెలంగాణ జ్యోతి: ఈనెల 12న ఏటూరు నాగారం మండల తుడుం దెబ్బ నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించ నున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఐటీడీఏ ఆవరణలో జరిగిన సమావేశం తుడుందెబ్బ ములుగు డివిజన్ అధ్యక్షులు పోడెం శోభన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొరగట్ల లక్ష్మణ్ రావు, జిల్లా అధ్యక్షులు నల్లెబోయిన లక్ష్మణ్ దొర మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని 12 గ్రామ పంచాయతీల ప్రతినిధులు కమిటీ ఎన్నికలకు హాజరు కానున్నారు. చిన్నబోయినపల్లి గ్రామంలో నిర్వహించే ఈ ఎన్నికల కు సంబంధిత నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రతినిధి కోరేం మొగిలి, జిల్లా ప్రసార కార్యదర్శి సోయం ఈశ్వరయ్య, యాలం దేవేందర్, జిల్లా నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!