ఆటో ప్రమాదం.. 23 మంది కూలీలు గాయాలు

On: April 10, 2026 9:37 AM

ఆటో ప్రమాదం.. 23 మంది కూలీలు గాయాలు

ఆటో ప్రమాదం.. 23 మంది కూలీలు గాయాలు

ములుగు, ఏప్రిల్ 10 తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం వెలుతుర్లపల్లె గ్రామానికి చెందిన 23 మంది కూలీలు మిర్చి పంట కోయడానికి ఆటోలో వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో 23 మంది కూలీలు గాయపడగా, వారిని వెంటనే ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి రాష్ట్ర మంత్రి సీతక్క ఆసుపత్రిని సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు. వారికి అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందించాలని, మెరుగైన చికిత్స కల్పించాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారని, ప్రభుత్వం తరఫున బాధితులకు పూర్తి సహాయం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!