మంత్రి సీతక్క ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వెంకటాపురం కాంగ్రెస్ నేతలు. 

Written by telangana jyothi

Published on:

Seetakka | మంత్రి సీతక్క ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వెంకటాపురం కాంగ్రెస్ నేతలు. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం కాంగ్రెస్ నేతలు, పార్టీ ప్రజాప్రతినిధులు సోమవారం ఉదయం పంచా యతీరాజ్,గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్కకుములుగులో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ములుగు క్యాంపు కార్యాల యంలో మంత్రి సీతక్క ను కలిసి మారుమూల ప్రాంతమైన ఏజెన్సీ వెంకటాపురం, వాజేడు గిరిజన మండలాల్లో అభివృ ద్ధి సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని, వెనుకబడి ఉన్న రెండు మండలాల్లో ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ పథకాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అలాగే వెంకటాపురం మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశా ల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మంజూరు చేయాలని, గ్రామీణ రోడ్లు అభివృద్ధి చేయాలని, సాగునీటి వనరులు, ఇతర సంక్షే మ పథకాలు మారుమూల ఏజెన్సీ గిరిజన ప్రాంతాలైన వెంక టాపురం, వాజేడు మండలాలకు అధిక నిధులు మంజూరు చేసి అబివ్రుద్ది చేయాలని వెంకటాపురం కాంగ్రెస్ నేతలు, పార్టీ ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలుపుతూ విజ్ఞప్తి చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో, ఘనవిజయం సాధించిన సీతక్కను అభినందించి, ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మంత్రి సీతక్క ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో సీనియర్ కాంగ్రెస్ నేత వెంకటాపురం పిఎసిఎస్ అధ్యక్షులు చిడెం మోహన్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం శివ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిట్టెం టాకాయ్య‌ , మన్యం సునీల్, రమేష్, సొసైటీ డైరెక్టర్ పల్నాటి ప్రకాష్,కళాధర్ ,రమణయ్య సల్లూరి ఎల్లయ్య, రమణయ్య, శ్రీను, ఎంపీటీసీలు రవి, సీతాదేవి ఇంకా పలువురు నాయకులు కార్యకర్తలు మంత్రి సీతక్క ను కలసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

Tj news

1 thought on “మంత్రి సీతక్క ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వెంకటాపురం కాంగ్రెస్ నేతలు. ”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now