ఈనెల 19న లక్నవరం తైబంది సమావేశం
– ఐబీ డిఈ చిదిరాళ్ల శ్రీనివాస్ వెల్లడి
గోవిందరావుపేట, డిసెంబర్ 15, తెలంగాణ జ్యోతి : లక్నవరం చెరువు కింద తైబందీ నిర్వహించేందుకు ఈనెల 19న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఐబి డిఈ చిదురాల శ్రీనివాస్ విలేకరులకు తెలిపారు. శుక్రవారం గోవిందరావుపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 19న మండల కేంద్రంలోని రైతు వేదికలో లక్నవరం కాలువలకు సంబంధించిన యాసంగి తైబందీ సమావేశం నిర్వహిస్తున్నామని రైతులు, ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని వారి సలహాలు సూచనలు వివరించాలని ఆయన కోరారు. ఉదయం 11 గంటలకు రైతు వేదికలో సమావేశం ప్రారంభమవుతుందని సకాలంలో రైతులు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.