గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు. 

Written by telangana jyothi

Published on:

గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వాజేడు మండలం ఏడుజెర్లపల్లి గ్రామపంచాయతీ లో బుధ వారం రెండు గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహించారు. ఏడుజెర్ల పల్లి, కొత్తూరు, మరియు ముత్తారం లలో వైద్యాధికారులు డాక్టర్ కొమరం మహేంద్ర , డాక్టర్ మధుకర్ ల ఆధ్వర్యంలో గర్భవతులు, బాలింతలకు, మధుమేహం, రక్తపోటు, క్షయ వాదిగ్రస్తులకు మందు లు పంపిణీ చేశారు. రెండు గ్రామాలలో 56 మంది గర్భవ తులు, 9 బాలింతలు, 6 క్షయ వ్యాధిగ్రస్తులు పరీక్షించుకున్నారు. ఈ కార్యక్ర మంలో  వైద్యాధికారులు  డాక్టర్ మహేందర్,  డాక్టర్ మధుకర్,   సిహెచ్ఓ సూర్యప్రకాశరావు, హెల్త్ సూపర్వైజర్ కుప్పిలి కోటిరెడ్డి, హెల్త్ అసిస్టెంట్. శ్రీనివాసరావు, అంగన్ వాడి టీచర్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now