ఉచిత బస్సు ప్రయాణంపై హర్షం వ్యక్తం చేసిన మహిళలు
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఆర్టీసీ బస్సులలో మహిళా సోదరీమణులకు ఉచిత బస్సు ప్రయాణం ను ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం ఆర్టీసీ బస్టాండ్ లో కాంగ్రెస్ నాయ కులు, కార్యకర్తలు మహిళా ప్రజాప్రతినిధులు ఆనందో త్సవాల మధ్య ఆర్టీసీ బస్సు ఎదుట జెండా ఊపి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారం టీల పథకంలో భాగంగా మహిళా సోదరీ మణులకు ఉచిత బస్సు సౌకర్యం తో నేడు సోనియాగాంది పుట్టిన రోజు సంధ్ ర్భాంగా ప్రారంభించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దని , నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ని అభినందించారు. ఈకార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు పిఎసిఎస్ చైర్మన్ చిడెం మోహన్ రావు , మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, జడ్పిటిసి పాయం రమణ, బాల సాని వేణు, నాయకులు రమేష్, కాంగ్రెస్ ఎంపీటీసీలు రవి, సర్పంచులు పార్టీ కార్యకర్తలు అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని, ఉచిత బస్ సౌకర్యాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ తమకు ఇచ్చిన సౌకర్యం సద్వినియోగం చేసుకుంటామని, ఈ సందర్భంగా నూతన సి.ఎమ్.రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అభినందనలతో శుభాకాంక్షలు తెలిపారు.