మంత్రిని కలిసిన ములుగు కాంగ్రెస్ శ్రేణులు.
ములుగు, డిసెంబర్ 7, తెలంగాణ జ్యోతి : హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం లో గిరిజన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ములుగు కాంగ్రెస్ శ్రేణులు మర్యాద పుర్వకముగా కలిసి పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు మిఠాయిలు పంచి, బాణాసంచా కాల్చి వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. మంత్రిని కలిసిన వారిలో ములుగు పట్టణ అధ్యక్షుడు చింతనిపుల బిక్షపతి, మాజీ ఎంపిటిసి ఇమ్మడి రాజు యాదవ్, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు గందె శ్రీను, మాజీ ఉపసర్పంచ్ ఎల్లావుల అశోక్, మేడికొండ వెంకటరెడ్డి, వార్డు సభ్యుడు బైకానీ ఐలోని, సుంకరి రవీందర్, ఈర్ల మొగిలి తదితరులు పాల్గొన్నారు.