వెంకటాపురం, వాజేడు మండలాలలో కాంగ్రెస్ విజయోత్సవాలు.
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు.
– భారీ ర్యాలీలు బాణసంచా పేలుళ్లు.
వెంకటాపురం నూగురు తెలంగాణా జ్యోతి ప్రతినిది : నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విజయోత్సవాలు నిర్వహించారు. బాణాసంచా పేళుళ్ళ , డిజె సౌండ్ పాటలతో భారీ ర్యాలీలు తో రంగులు చల్లుకొని నూతన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా ముఖ్య మంత్రిగా పేరుగాంచిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి వర్గానికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ర్యాలీ లు నిర్వహించారు. మండలాల్లోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు విజయోత్స వాలు, బాణాసంచా పేలుళ్లతో మారుముల గ్రామాల్లో సైతం ఆనం దోత్సవాలతో , జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలతో, రంగు లు చల్లుకొని పరస్పరం మిఠాయిలు పంపిణీ చేసుకొని, ఇందిరమ్మ రాజ్యం వర్ధిల్లాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభా కాంక్షలు తెలుపుతూ పండుగ వాతావరణంలో విజయోత్స వాలు ర్యాలీలు నిర్వహించారు. వెంకటాపురం మండల కేంద్రంలో ప్రధాన వీధులలో మార్కెట్ సెంటర్, బస్టాండ్ సెంటర్లలో భారీ ర్యాలీలు నిర్వహించి బాణసంచా లతో, రంగులు జల్లుకొని కాంగ్రెస్ కార్యకర్తలు నాయకు లు విజయోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి, నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిడెం శివ, మన్యం సునీల్, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు రమేష్, ఎంపీటీసీలు, పార్టీ సర్పంచు లు, మహిళా కార్యకర్తలు, పార్టీ ప్రజాప్రతినిదులు , అభిమానులు పలువురు పాల్గొని నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం సందర్భంగా విజయోత్సవా లతో, మధ్యాహ్నం ఒంటిగంట నుండి సాయంత్రం పొద్దుపోయే వరకు సంబరాలు చేసుకున్నారు.ఉఫ్ఫేడు వీరాపురం, పాత్ర పురం, వీరభద్రవరం, ఎదిర తోపాటు , వాజేడు మండలంలోని ఏడిజెర్లపల్లి, వాజేడు, అయ్యవారిపేట , ధర్మారం ఇంకా పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా విజయోత్సవాలు జరుపుకొని, ఇంది రమ్మరాజ్యం, సంక్షేమ రాజ్యం అంటూ పార్టీ కార్యకర్తలు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలతో గ్రామాల్లో హోరెత్తించారు. కాంగ్రె స్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం, నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగా, గురువారం వ్యవసాయ పనులను సైతం మానుకొని, ప్రజలు, పార్టీ అభిమానులు నాయకు లు, కార్యకర్తలు రైతులు,మహిళలు , ఆదివాసీలు పెద్ద సంఖ్యలో విజయోత్సవాల్లో పాల్గొన్నారు.