కోటగుళ్లలో జెడ్పి సీఈవో విజయలక్ష్మి పూజలు
– కార్తీక సోమవారం సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులు
– దీప దానాలు చేసిన మహిళలు
గణపురం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ల లో సోమవారం జడ్పీ సీఈవో విజయలక్ష్మి స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక సోమవార పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగ ణంలో జెడ్పి సీఈవో విజయలక్ష్మి గణపురం ఎంపీడీవో డాక్టర్ లెక్కల అరుంధతి తో కలిసి దీపాలను వెలిగించారు. ఈ సంద ర్భంగా అర్చకులు నరేష్ ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు. అదేవిధంగా కార్తీకమాసం సోమవారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. అనంతరం మహిళలు దీప దానాలు చేయడంతో పాటు నందీశ్వరుడు, తులసి, మేడీ, రావి ఉసిరి, మారేడు, నాగదేవుని, పుట్ట వద్ద దీపాలను వెలిగించారు. కార్తీకమాస ఉత్సవాలను పురస్కరించుకొని కోటగుళ్ల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేసింది.