కలకత్తా అంతర్జాతీయ సదస్సులో వాజేడు కళాశాల తెలుగు లెక్చరర్, కథారచయిత డా.అమ్మిన.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది :ములుగు జిల్లా వాజేడు ప్రబుత్వ జానియర్ కళా శాల తెలుగు ఉపన్యాస కులు డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు కలకత్తా జాదవపూర్ విశ్వ విద్యాలయం లో ఆదివారం జరిగిన అంతర్జాతీయ శాంతి సదస్సు లో పాల్గొన్నారు. వాజేడు ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలుగు ఉపన్యాసకుడు, రచయిత డా:అమ్మిన శ్రీనివాసరాజు యూనివర్శి టీ వి. సి, డా: బుద్ధదేవ్ సాహు ముఖ్య అతిథిగా హాజరైన ,ఈ సదస్సులో “ఎక్స్ ప్లోరింగ్ ఫీస్” అనే వ్యాస కథా సంకలనం ఆవిష్క రించారు. దీనిలో డా:అమ్మిన వ్రాసిన “వారసలు కావలెను” అనే తెలుగు కథను ప్రముఖ అనువాద రచయిత ఎల్గటి తిరుపతి రెడ్డి “ఐ వాంట్ సక్సస సర్స్” పేరుతో, ఇంగ్లీష్ లోకి అనువదించారు. ఈ సదస్సులో… జరిగిన బహుభాషా కవి సమ్మేళనంలో డా:అమ్మిన చదివిన “చూపుడు వేలు ” తెలుగు కవిత, అంబేద్కర్ అధ్యయన వైభవాన్ని చాటింది.. కార్యక్రమ నిర్వాహకులు, సంపాదకులు, షర్భసిస్ కుమార్ పౌల్, అనువాద కవి ఎల్గటి తిరుపతిరెడ్డి తో పాటు తెలంగాణ కవులు గందె పర్శు రామారావు, శిష్ట్లా రాజేశ్వ ర శాస్త్రి, తో పాటు మేఘాలయ, ఝార్ఖండ్, తమిళనాడు, మొదలైన ప్రాంతాలకు చెందిన కవులు రచయితలు ఈకార్యక్రమం లో పాల్గొన్నారు.