ఎన్నికల ఫలితాల సందర్భంగా ఊరేగింపులు ర్యాలీలు నిషేధం.
– పోలీస్ శాఖ హెచ్చరిక.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిదిలో. ఎన్నికల ఫలితాలు సందర్భంగా ఆదివారం గెలుపొందిన అభ్యర్థులు తరుపున పార్టీలకు చెందినవారు ర్యాలీలు, ఊరేగింపులు, బాణసంచా పేలుళ్లు నిషేధమని తెలిపారు. ఎన్నికల కోడ్ ఈనెల 5వ తేదీ వరకు అమల్లో ఉన్నందున, 144 సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు, పేరూరు , వెంకటాపురం పోలీస్ సబ్ ఇన్స్పెక్ట ర్లు ఉన్నతాదికారుల ఇదేశంపై పత్రికా ప్రకటన జారీ చేశారు. 144 సెక్షన్ ప్రకారం గుమికూడి ఉండటం, ర్యాలీలు ,డీజే పాటలతో ఇతర కార్యక్రమాలు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిషేధించబ డిందని తెలిపారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై పోలీస్ శాఖ కేసులు నమోదు చేయడం జరుగుతుందని,ప్రజలు సహకరించా లని, ఈ సందర్భంగా ఆయా పోలీస్ స్టేషన్ల సబ్ ఇన్స్పెక్టర్లు మీడియా ద్వారా తెలిపారు.