మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న విద్యార్థి
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికలలో గురువారం మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న విద్యార్థులు తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. మంథని నియోజకవర్గం కాటారం మండల కేంద్రంలోని 148 పోలింగ్ కేంద్రంలో గాదె హిమబిందు తన మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. హైదరాబాదులో డిగ్రీ చదువుకుంటున్న హిమబిందు కాటారంలో తమ స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
1 thought on “మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న విద్యార్థి”