ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛగా జరిగేలా చర్యలు
– ఎన్నికల పరిశీలకులు అభయ్ నందన్ అభిస్తే, అమిత్ కుమార్, కౌశిక్ రాయ్
తెలంగాణ జ్యోతి, భూపాలపల్లి ప్రతినిధి: జిల్లాలో సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఎన్నికల సాధారణ, పోలిసు, వ్యయ పరిశీలకులు అభయ్ నందన్ అభిస్తే, అమిత్ కుమార్, కౌశిక్ రాయ్ లు సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎన్నికల భద్రత, ఎలక్షన్ నిర్వహణలో భాగంగా జిల్లా ఎస్పి శ్రీ కిరణ్ ఖరే తో కలిసి పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రశాంతంగా స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలని, పోలీసు బృందాలు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. మావోయిస్టు ప్రభావిత, సమస్యత్మక ప్రాంతాల్లో నిఘా పెంచాలని పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఈవీఎంలను పటిష్ట బందో బస్తు మధ్య తరలించాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద0 పటిష్ఠ భద్రత ఏర్పాటు భద్రత కల్పించాలని, పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు, అనంతరం ఎస్పీ కిరణ్ భద్రతా ప్లానిoగ్, బందోబస్తు, పకడ్బందీ పోలింగ్ నిర్వహణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల పరిశీలకులకు వివరించారు. ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ జిల్లాలోని మావోయిస్ట్ ఎఫెక్టేడ్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టామని, జిల్లా పోలీసులతో పాటు, కేంద్ర సాయుధ బలగాలతో బందోబస్తు చేశామన్నారు. అంతర్రాష్ట్ర ,ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్పోస్టుల్లో నిఘా పెంచి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నామని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా తగిన చర్యలు చేపడుతున్నామని, ఎన్నికల్లో నేరాలకు పాల్పడే రౌడీ షీటర్, సమస్యలు సృష్టించే వారిని బైండోవర్ చేశామని, ప్రశాంత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటేసేలా చేపట్టామని చర్యలు తీసుకుతున్నానని ఎస్పి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు రాములు, రామ్మోహన్ రెడ్డి, నారాయణ నాయక్, ఉమా చారి, భూపాలపల్లి, చిట్యాల, కాటారం, మహాదేవ్ పూర్ సీఐలు, రామ్ నర్సింహారెడ్డి, వేణు చందర్, రంజిత్ రావు, కిరణ్, ఎస్బీ, ఇన్స్పెక్టర్ సూర్య ప్రకాశ్, ఎలక్షన్ సెల్ ఇంఛార్జ్ పులి వెంకట్, జిల్లా పరిధిలోని ఎస్సైలు పాల్గొన్నారు.