మాజీ సింగిల్ విండో సొసైటీ చైర్మన్ హఠాన్మరణం
తెలంగాణ జ్యోతి, కాటారం : కాటారం మండలం శంకరంపల్లి మాజీ సింగిల్ విండో చెర్మెన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాగరి పెంటయ్య సోమవారం తెల్లవారు జామున గుండే పోటుతో మరనించారు. స్వర్గీయ మాజీ అసెంబ్లీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావుకు సమకాలికులు . జాగరి పెంటయ్య మృతదేహానికి పూలమాల వేసి, కాంగ్రెస్ పార్టీ కండువా వేసి ఎఐసిసి కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, మంథని శాసనసభ్యులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి , కాటారం సింగిల్ విండో చెర్మెన్ చల్ల నారాయణ రెడ్డి సందర్శించి, పెంటయ్య పార్థీవ దేహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీటీసీ తోట జనార్ధన్ సంతాపం వ్యక్తం చేశారు. పెంటయ్య మృతి తో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.