ప్రచారంలో దూసుకుపోతున్న కమలం.
– బూత్ ల వారిగా ఎన్నికల ప్రచారం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : భద్రాచలం నియోజకవర్గం లోని వెంకటాపురం, వాజేడు మండలాల్లో భారతీయ జనతా పార్టీ భద్రాచలం నియోజకవర్గం అభ్యర్థి కుంజా ధర్మారావు విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ నేతలు ముమ్మర ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బూత్ ల వారిగా ప్రచార కమిటీలను ఏర్పాటు చేసి, ఉదయం సాయంత్రం వేళలో వ్యవసాయ పనులు కారణంగా గానికి ఇబ్బందులు లేకుండా ముమ్మర ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ, కమలం గుర్తుకే ఓటు వేయాలని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబంలో లబ్ధిదారులకు అందుతున్నాయని ప్రచార కార్యక్రమంలో ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు భద్రాచలం ఎమ్మెల్యే బిజేపి అభ్యర్థి కుంజా ధర్మారావు గారి కమలం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ప్రతి ఓటర్ ను కలుసు కొని పార్టీ కమలం గుర్తును విస్తృతంగా ప్రచారం నిర్వహి స్తున్నారు. అలాగే భద్రాచలం పార్టీ అభ్యర్థి కుంజా ధర్మారావు, ఎన్నికల ఇన్చార్జి లు, పార్టీ నేతలు ఇప్పటికే వెంకటాపురం, వాజేడు మండలంలో పర్యటించి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలే తమ పార్టీకి శ్రీరామరక్ష అని బూత్ కమిటీలను బలోపేతం చేసి, ఓటర్లకు కమలం గుర్తును పరిచయం చేసి నమూనా బ్యాలెట్ డమ్మీ బాక్స్ లతో కమలం గుర్తును పరిచ యం చేస్తున్నారు. ఇతర పార్టీల మాదిరి గా హంగులు ఆర్భాటాలు లేకుండా లేకుండా నిరాడంబరంగా, ధర్మంగా బూత్ కమిటీలు చాప క్రింద నీరులా బిజెపి పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సంద ర్భంగా వివిధ పార్టీల నుండి వందలాది మంది బిజెపిలో చేరటం తో వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా బిజెపి లోకి ఆహ్వాని స్తున్నారు .బిజెపి ఎన్నికల ప్రచారం కమలం గుర్తు ప్రజల్లోకి నేరుగా దూసుకుపోతున్నది. వెంకటాపురం బిజెపి మండల అధ్యక్షులు రఘురాం, వాజేడు బిజెపి మండల అధ్యక్షులు కందుల రామ్ కిషోర్, పార్టీ సీనియర్ నేతలు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా బిజెపి సోదరీమణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇంటింటి ప్రచార కార్యక్రమం తో పాటు, బూత్ ల వారిగా కమిటీలు వేసుకొని, కమలం గుర్తును ఓటర్లకు పరిచయం చేస్తూ, నమూనా బ్యాలెట్ బాక్స్ తో అవగాహన కల్పిస్తున్నారు. బిజెపి అభ్యర్థి కుంజా ధర్మారావు ను అధిక మెజారిటీతో గెలిపించి, మారుమూల ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని, కమల ం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా బిజెపి నాయకులు, కమల నాధులు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు .మరో కొద్ది రోజులు మాత్రమే ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటం తో వెంకటాపురం, వాజేడు మండలాల్లో బిజెపి నేతలు ప్రచారాన్ని వేగవంతం చేశారు.
1 thought on “ప్రచారంలో దూసుకుపోతున్న కమలం. ”