కాళేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు

కాళేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు

– శని త్రయోదశి సందర్భంగా భక్తుల రద్దీ.

మహాదేవపూర్ తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండలం, కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరిం చుకొని శని త్రయోదశి సందర్భంగా అనుబంధ దేవాలయం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, నవగ్రహాల వద్ద శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు గోదావరి లో పుణ్య స్నానాలు ఆచరించి కాలసర్ప, శని నివారణ పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాలు గోదావరి తీరంలో భక్తుల కోలాహలం నెలకొంది. అలాగే మహాదేవపూర్ వాస్తవ్యులు జీవన్ రెడ్డి రజిని దంపతులు భక్తులకు పాలు పంపిణీ చేయడం జరిగింది. సాయంకాలం కార్తీక మాసం పంచరత్నాలు సందర్భాన్ని పురస్కరించుకొని మూడవరోజు గోదావరి నది వద్ద నదిహారతి నిర్వహించడం జరిగినది.కార్తీక మాసం వైకుంఠ చతుర్దశి సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించడం జరిగినది.శని త్రయోదశి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు రావడం వలన ఇట్టి పూజల ద్వారా ఆలయానికి 3,70,000 ఆదాయం చేకూరింది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “కాళేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు”

Leave a comment