అభివృద్ధిని చూసి పట్టం కట్టాలి : అభ్యర్థి నాగజ్యోతి
తెలంగాణ జ్యోతి, నవంబర్ 25, ములుగు ప్రతినిధి : 2014కు ముందు ములుగు జిల్లా అభివృద్ధి, అప్పటి నుంచి పదేళ్ల కాలంలో 2023వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో జిల్లాలో జరిగిన అభివృద్ధిని చూసి పట్టం కట్టాలని బీఆర్ఎస్ ములుగు అభ్యర్థి, జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి ఓటర్లను కోరారు. శనివారం ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్లతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ నిరుపేదల ఆపన్నహస్తంలా సీఎం కేసీ ఆర్ అన్నిరంగాల ప్రజలకు చేదోడుగా నిలిచారని పేర్కొన్నారు. ఒకప్పటి ఆర్థిక పరిస్థితికి నేటికి పోల్చుకోవాలని, అభివృద్ధి ఏ మేరకు పెరిగిందో తెలుసు కోవాలన్నారు. విద్య, వైద్యం, వృత్తి పరమైన అంశాల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా నిలి చిందని పేర్కొన్నారు. ములుగు జిల్లాను ఇంకా అభివృద్ధి చేయా ల్సిన అవసరం ఉందని, అధికార పార్టీ ఎమ్మెల్యేను గెలిపిస్తే జిల్లా సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధి మరింత పెరుగుతుంద న్నారు. జిల్లాలోని ఏజెన్సీ బిడ్డలకు చేదోడుగా ఉంటానని, నిరు పేదలకు భరోసాగా నిలుస్తానని నాగజ్యోతి వెల్లడించారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని విజ్క్షప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.
1 thought on “అభివృద్ధిని చూసి పట్టం కట్టాలి : అభ్యర్థి నాగజ్యోతి”