ములుగు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. 

Amithsha ములుగు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. 

– బేజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం

– అమిత్ షా పర్యటనతో గ్రాఫ్ పెరుగుతుందంటున్న నేతలు

తెలంగాణ జ్యోతి ,నవంబర్ 25, ములుగు ప్రతినిధి : ములుగులో కేంద్ర హోమంత్రి, బీజేపీ నేత అమిత్ షా టూర్ ఆదివారం పర్యటన ఉండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. బీజేపీ అభ్యర్థి డాక్టర్ అజ్మీర ప్రహ్లాద్ తరఫున ప్రచారం నిర్వహించేందుకు ఆయన పర్యటిస్తుండగా సుమారు 60వేల మందిని సభకు తరలించేందుకు జిల్లా పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ములుగులో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ ఉంటుందని భావించగా అమిత్ షా టూర్ బీజేపీ గ్రాప్ ను పెంచుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. ఏదేమైనా ములుగులో అమిత్ షా టూర్ చర్చకు దారితీస్తోంది. కాగా, కేంద్ర హోంమంత్రి కావడంతో ములుగు మొత్తం సెంట్రల్ పోలీసు బలగాల గుప్పిట్లోకి వెళ్లింది. సభా ప్రాంగణాన్ని వారి చేతుల్లోకి తీసుకున్నారు. అమిత్ షా టూర్ సక్సెస్ చేయాలని పార్టీ వర్గాలు ఉత్సాహం చూపుతున్నాయి. టూర్ సక్సెస్ అయితే బీజేపీకి బలం పెరుగుతుందని, బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ అంశాలు తమకు లాభం చేకూరుస్తాయని భావిస్తున్నారు. ములుగులోని సాధన హై స్కూల్ వద్ద సభ జరుగనుంది.

– కేంద్ర హోంమంత్రి అమిత్ షా టూర్ షెడ్యూల్.. :

@ 1:55 నిమిషాలకు డిగ్రి కళాశాలలో హెలికాప్టర్ ల్యాండ్

@ 2:00 నిమిషాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బిజెపి కార్యకర్తలు స్వాగతం పలకడం

@ 2:05 సభను ఉద్దేశించి 40 నిమిషాల పాటు కొనసాగనున్న అమిత్ షా ప్రసంగం

@ 2: 50 నిమిషాలకు తిరుగు ప్రయాణం

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “ములుగు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ”

Leave a comment