కల్లుగీత కార్మికులను విస్మరించిన బిఆర్ఎస్ నాయకులను నిలదీయాలి
– కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ జ్యోతి, నవంబర్ 25, ములుగు ప్రతినిధి : కల్లు గీత కార్మికులకు గతంలో మంత్రి కేటీఆర్ గీతన్నలకు ప్రమాదాలు జరుగకుండా సెప్టి మోకులు, ద్విచక్ర వాహనాలు, ఇతర సమస్యల ను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి అమలు చేయలేదని, ఇప్పుడు ఓట్ల కోసం వచ్చే బిఆర్ఎస్ నేతలను గీత కార్మికులు నిలదియాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ గీత కార్మికులకు పిలుపునిచ్చారు. గౌడ సంఘం జిల్లా నాయకులు బోడిగే బిక్షపతి గౌడ్ అధ్యక్ష తన జంగాలపల్లి, ఇంచర్ల తాటి వనం లో గౌడ సంఘం సమావేశం నిర్వహించగా ముఖ్యఅతిథిగా హాజరు అయ్యారు. గీత కార్మికులకు ఇబ్బందిగా ఉన్న మెడికల్ బోర్డు నిబంధనలు మార్చలేదని అన్నారు. బీసీ బందులో గీత కార్మికుల కు ప్రాధాన్యత ఇవ్వకుండా బిఆర్ఎస్ పార్టీ గీత కార్మికులనుమోసం చేసిందని అన్నారు. ములుగు జిల్లాలో కొంతమంది బిఆర్ఎస్ వలస నాయకులు గీత కార్మికుల దగ్గరికి వచ్చి కాటమయ్య, ఎల్లమ్మ గుడి కట్టిస్తామని మోసపురిత హామీలు ఇస్తున్నారని ఆ హామీలు గీత కార్మికులు నమ్మే పరిస్థితి లో లేరని గీత కార్మికులు చైతన్య వంతులు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిపెస్టో లో జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడుతామణి గీత వృత్తి కి రక్షణ కల్పిస్తామని ఎక్స్ గ్రేషియా 10 లక్షలు ఇస్తామని మేని పేస్టో లో పెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ కి కల్లు గీత కార్మిక సంఘం నుండి హార్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఏ పార్టీ అధికారం లోకి వచ్చిన కల్లు గీత కార్మికుల హక్కుల కోసం కే క్యూ కె ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని శ్రీను వాస్ గౌడ్ అన్నా రు. ఈ కార్యక్రమం లో కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన రవిగౌడ్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి కునూరు అశోక్ గౌడ్ కే క్యూ కె ఎస్ జిల్లా నాయ కులు ముసనిపల్లి కుమార్ గౌడ్, జనగాం శ్రీనివాస్ గౌడ్, వేముల వేణు గౌడ్, దేసిని రమేష్ గౌడ్, పులి శ్రీనివాస్ గౌడ్, ముని గాల రవిగౌడ్, మునిగాల సురేష్, బోడిగే కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.